All About Indian Army Day | Best Things
మనం ఈరోజు తింటున్నాం అంటే కారణం కర్షకుడు.. ప్రశాంతంగా ఉంటున్నాం అంటే కారణం సైనికుడు.. ఇద్దరు లేనిది మనం లేం.. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు.
రేయనక పగలనక దేశాన్ని కాపాడాటమే లక్ష్యంగా.. మన ప్రాణాలు కాపాడటమే ధ్యేయంగా పెట్టుకొని తమ కుటుంబల గురించి ఆలోచించకుండా దేశ శ్రేయస్సుకై పాటు పడుతున్న సైనికులను స్మరించుకుందాం..
వారి త్యాగాలను గుర్తు చేసుకుందాం.. మనస్పూర్తిగా వారికి సెల్యూట్ చేసుకుందాం.. నేడు భారత సైనిక దినోత్సవం.
భారతదేశానికి చెందిన ఫీల్డు మార్షల్ 'కె.యం.కరియప్ప' 1949 జనవరి 15న భారత సైన్యానికి తొలి కమాండర్-ఇన్-చీఫ్ గా ప్రమాణ స్వీకారం చేసిన రోజును పురస్కరించుకొని జనవరి 15న ప్రతి సంవత్సరం 'జాతీయ సైనిక దినోత్సవం'
జరుపుకుంటున్నాం. అప్పటి వరకు బ్రిటన్‌కు చెందిన 'సర్ ఫ్రాన్సిస్ బుచ్చర్' కమాండర్-ఇన్-చీఫ్ గా వ్యవహరించేవారు. సైనిక దినోత్సవం రోజున న్యూఢిల్లీలోని ఇండియాగేట్ వద్ద
దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన జవాన్లకు నివాళులు అర్పిస్తారు. ఆ తరువాత దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో సైనిక కవాతు నిర్వహిస్తారు.
Comments
Post a Comment