ఢిల్లీ మత ప్రార్థనలతో ఏపీ ఉలికిపాటు: మంత్రులకు టాస్క్.. బరిలో వలంటీర్లు: ప్రాంతాల వారీగా స్కానింగ్.

అమరావతి: దేశ రాజధానిలోని ప్రఖ్యాత హజ్రత్ నిజాముద్దీన్ మసీదు సమీపంలోని మర్కాజ్ ప్రాంతంలో నిర్వహించిన సామూహిక మత ప్రార్థనల ఉదంతం.. ఏపీలో తీవ్ర కలకలానికి దారి తీసింది. కొత్తగా నమోదైన కేసులకు ఈ మత ప్రార్థనలకు సంబంధం ఉండటం ఉలికిపాటుకు ప్రభుత్వాన్ని ఉలికిపాటుకు గురి చేస్తోంది. ఎంతమంది ఈ మత ప్రార్థనల్లో పాల్గొన్నారనే విషయంపై ఆరా తీస్తోంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే.. ఉత్తరాంధ్ర నుంచి పెద్ద సంఖ్యలో స్థానికులు ఈ మత ప్రార్థనల్లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లొచ్చినట్లు ప్రాథమికంగా నిర్దారించింది. దీనితో ప్రాంతాలవారీగా స్కానింగ్ చేస్తోంది.




స్వచ్ఛందంగా బయటికి వస్తే గానీ..

కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన ప్రస్తుత పరిస్థితుల్లో వందలాది మంది ఒకేచోట గుమికూడి మత ప్రార్థనల్లో పాల్గొనడం వల్ల పరిస్థితులు అదుపు తప్పుతాయనే ఆం
దోళనలు వ్యక్తమౌతున్నాయి. మత ప్రార్థనల్లో పాల్గొని తమ తమ రాష్ట్రాలకు వెళ్లిన వారంతా స్వచ్ఛందంగా వైద్య పరీక్షలను చేయించుకోవాలంటూ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు విజ్ఙప్తి చేస్తున్నాయి. వారికి ఉచితంగా వైద్య చికిత్సను అందిస్తామని ప్రకటించాయి. ఇప్పటికే తెలంగాణలో కరోనా వైరస్ బారిన పడి ఆరు మంది మరణించడం, వారంతా ఈ ప్రార్థనలకు హాజరైన వారే కావడం.. దాని తీవ్రతను స్పష్టం చేస్తోంది.

Comments

Popular posts from this blog

With 12 new coronavirus cases in Indore, Madhya Pradesh’s tally jumps to 98

31 मार्च: जब अमेरिका में रचा गया इतिहास

Wajid Khan’s mother tests COVID-19 positive, was taking care of her son at hospital: Report